Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో అల్ల‌ర్లు..భారత ప్రభుత్వం అలర్ట్

నేపాల్‌లో అల్ల‌ర్లు..భారత ప్రభుత్వం అలర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేపాల్‌లో మతపరమైన ఘర్షణలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ధనుశా జిల్లాలో ఒక ప్రార్థనా స్థలంపై కొందరు దాడికి పాల్పడి, ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద సంఖ్యలో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. రాహౌల్, పర్సా ప్రాంతాల్లో ఆందోళకారులు నిరసనలకు దిగారు. కొన్ని చోట్ల పరిస్థితి హింసాత్మకంగా మారడంతో స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. నేపాల్ తో సరిహద్దును మూసేసింది. ఎమర్జెన్సీ సేవలు మినహా, రాకపోకలను బంద్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -