Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండిన‌ పంటకు "తరుగు" తెగులు

పండిన‌ పంటకు “తరుగు” తెగులు

- Advertisement -

-సీసీఐ, మిల్లర్ల మాయాజాలం
-ఆరుగాలం కష్టపడ్డ రైతు ఆగం

నవతెలంగాణ – కాటారం
సబ్ డివిజన్ పరిధిలోని కాటారం,మహాదేవపూర్, మహా ముత్తారం, మలహర్,పలిమెల, మండలాలలో ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన తెల్ల బంగారానికి సీసీఐ, మిల్లర్ల మాయాజాలంతో తరుగుదొపిడి చేస్తున్నారని, ఆరుగాలం కష్టం చేసి రైతన్నలు ఆగమవుతున్నారని, రైతుల శ్రమను దళారులు దోచుకుంటున్నారని వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రాత్రనక పగలనకా ఆరుగాలం కష్టపడి పత్తి పంట సాగు చేసి తీరా చేతికొచ్చిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, అంతేకాకుండా తరుగు పేరుతో, తేమ పేరుతో, రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నారని అన్నారు. ఉన్నత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో సిసిఐ, మిల్లర్లు అక్రమ సంపాదనకు కక్కుర్తి పడుతున్నారని, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొట్టే సతీష్, నాయకులు అబ్రహం లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -