నేడు ప్రయోగం
తిరుపతి : దేశ సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని, దేశ భద్రతను పెంచే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం రీశాట్ -1బి ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. పిఎస్‌ఎల్‌వి-సి 61 ద్వారా ఇఒఎస్-09 (రీశాట్-1బి) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి శనివారం ఉదయం 7.59 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 22 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు శాస్త్రవేత్తలు సుదీర్ఘ సమీక్షలు జరిపారు. జనవరిలో రోదసిలోకి పంపిన ఎన్‌విఎస్-02 ఉపగ్రహం సాంకేతిక సమస్యలు ఏర్పడి నిర్ణీత కక్ష్యలోకి వెళ్లలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిఎస్‌ఎల్‌వి-సి61 ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు.
పిఎస్‌ఎల్‌వి – సి61 ఉపయోగాలు
రీశాట్ -1బి ఉపగ్రహంలో అమర్చిన సి- బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) ప్రత్యేకత. ఈ రాడార్ సహాయంతో పగలు, రాత్రి ఎలాంటి వాతావరణ పరిస్థితులైన భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్ ఫొటోలు తీసి పంపనుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితుల విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఈ రాడార్ ఉపయోగపడనుంది.
రీశాట్ – 1బి కౌంట్‌డౌన్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -