Sunday, May 25, 2025
Homeఖమ్మంసమయం సద్వినియోగంతోనే  విద్యలో రాణింపు

సమయం సద్వినియోగంతోనే  విద్యలో రాణింపు

- Advertisement -

– ఏడీ డాక్టర్ హేమంత్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: అంతఃకరణ శుద్ధి,సమయం సద్వినియోగం,ప్రణాళికతో అభ్యసిస్తే నే ఏ విద్య లోనైనా రాణిస్తారని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ విద్యార్ధులకు సూచించారు. కళాశాల ఎస్సీ ఎస్టీ సెల్,జె  ఆర్ ఎఫ్ సెల్ (సోషల్ సైన్సెస్) విభాగాలు సంయుక్తంగా కళాశాల సిబ్బంది సాకారం తో ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షల సన్నద్ధత కోసం శనివారం అవగాహన  నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.పరీక్షల సన్నద్దానికి ప్రతి విద్యార్థి ప్రారంభ దశ నుండే ఆసక్తికరంగా కార్యక్రమాలలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   వ్యవసాయ ఉన్నత విద్యల్లో ప్రవేశ పరిక్షల తయారీ పై ప్రస్తుతం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ కళాశాలలో టీచింగ్ చేస్తున్న అశ్వారావుపేట కళాశాల పూర్వ విద్యార్థి కుమారి గిరీష్మ (ఐఏఆర్ఐ) పీజీ,వ్యవసాయ విద్యార్థులు తమ నాలుగు సంవత్సరాలు పూర్తి చేశాక వారికి ఉన్న ఉద్యోగాల గురించి వివరించారు. వ్యవసాయ విద్యలో ఉన్నత చదువులు చదివిన తర్వాత వారు జాతీయ స్థాయిలో ఉన్న ప్రవేశ పరీక్షలకు తయారీ గురించి తెలియజేశారు. వ్యవసాయ విద్యార్థులు ముఖ్యంగా నాబార్డ్ ఆర్బీఐ, ఎఫ్సీఐ, సీసీఐ వంటి జాతీయ సంస్థలలో జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల తయారి కి కావలసిన ముఖ్యమైన అంశాల గురుంచి,వివిధ మూకీ పరీక్షల సమాచారాలు గురించి తెలిపారు.తర్వాత ప్రత్యేకంగా ఐ సి ఏ ఆర్ సోషల్ సైన్సెస్ లో పీజీ ప్రవేశ పరీక్షకు విద్యార్థుల కు ఉపయోగపడే  పాఠ్య పుస్తకాల గురుంచి,పాటించవలసిన ముఖ్యమైన అంశాల గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ విభాగంలో ఆసక్తి ఉన్న మొదటి,రెండవ మరియు మూడవ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారికి ఉన్నత చదువుల ప్రవేశాల లో ఉన్న సందేహాలను నివృత్తి  చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎస్సీ ఎస్టీ సెల్ ఇంచార్జి కోటేశ్వర్ నిర్వహించారు. ఇందులో జె ఆర్ ఎఫ్ సెల్ సోషల్ సైన్సెస్ ఇంచార్జి  డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -