Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'ఆర్‌కె దీక్ష' రిలీజ్‌కి రెడీ

‘ఆర్‌కె దీక్ష’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

ఆర్‌ కె ఫిలిమ్స్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్‌కె దీక్ష’. బిఎస్‌ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్‌ అక్సఖాన్‌, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్‌ హీరోగా నటించారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్‌ శర్మ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్‌ కిరణ్‌ సంగీతం అందించగా, మేఘన శ్రీను ఎడిటర్‌గా పనిచేశారు. విడుదల దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర ప్రముఖుల చేతుల మీదగా ఈ చిత్ర ట్రైలర్‌, సాంగ్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌ అభిమానిగా ఆయన సినిమా పేరు మీద మరొక సినిమా చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్‌ని గుర్తు చేసుకుంటూ ఒక పాట ఉంటుంది. హీరోగా కిరణ్‌, హీరోయిన్‌గా ఢీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన అక్సఖాన్‌ చేస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘మీ అందరికీ చిత్ర ట్రైలర్‌, సాంగ్స్‌ నచ్చాయని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమాలో నేను కూడా కొరియోగ్రఫీ చేశాను. డాన్సర్‌గా, నటిగా నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను’ అని హీరోయిన్‌ అక్సఖాన్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -