- Advertisement -
రూ. 1.5 లక్షలతో కైండ్‌ఇండియా వితరణ
హైదరాబాద్ : మంచినీటి కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న కైండ్ ఇండియా.. రూ. 1.5 లక్షలతో ఆర్‌ఓ (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నాచారం మండల పరిషత్ ప్రాథమీకోన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కైండ్‌వేవ్స్ ఇండియా ఫౌండేషన్ డైరెక్టర్ కుంద ప్రతాప్ ఆర్‌ఓ ప్లాంట్‌ను అధికారికంగా ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి సమస్యను తీర్చిన కుంద ప్రతాప్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చినబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -


