Thursday, August 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో

రోడ్డు ప్రమాదంలో

- Advertisement -

సీపీఐ రాష్ట్ర నేత అయోధ్యచారి మృతి
విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఘటన
నవతెలంగాణ-సూర్యాపేట

రోడ్డు ప్రమాదంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్యచారి మరణించారు. ఈ ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్యచారి మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వచ్చారు. బుధవారం ఉదయం కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. జిల్లా కేంద్రంలోని యస్వీ డిగ్రీ కళాశాల సమీపంలో ధర్మభిక్షం విగ్రహం వద్దకు రాగానే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ అయోధ్య కారును వెనుక నుంచి వేగంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీపీఐ శ్రేణులు అయోధ్యచారి మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యాయి. పార్టీ నేతలు, అభిమానులు ఆస్పత్రికి చేరుకొని ఆయనకు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -