నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని జాతీయ రహదారి 63 చేపూరు బబ్లు దాబా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వేల్పూర్ నుండి ఆర్మూర్ వైపునకు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఏపీకి చెందిన లారీ డ్రైవర్ తోట నాగరాజు నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సయ్యద్ అన్వార్ (50) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న శనిగారం లక్ష్మీ కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రి నుండి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్హెచ్ఓ తెలిపారు.
సకాలంలో స్పందించిన 108..
రోడ్డు ప్రమాద వార్త తెలిసిన వెంటనే 108 వాహన సిబ్బంది గణేష్ ,తిరుమలేష్ లు వెంటనే స్పందించారు. క్షతగాత్రురాలి దగ్గర ఉన్న రూ.5 వేల నగదును ఆమె మనుమడికి అందజేశారు.



