Sunday, October 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికాలో రోడ్డు ప్రమాదం

అమెరికాలో రోడ్డు ప్రమాదం

- Advertisement -

మంచిర్యాలకు చెందిన తల్లీకూతురు మృతి

నవతెలంగాణ-మంచిర్యాల
అమెరికాలోని చికాగో నగరంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల పట్టణానికి చెందిన తల్లీకూతురు మృతిచెందారు. మనువడి పుట్టినరోజు వేడుకకు వెళ్లే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి(52), ఆమె కూతురు తేజస్విని(32) అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. తేజస్విని పెద్ద కొడుకు విహాన్‌ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణం రెడ్డి కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి విగేష్‌, రమాదేవి దంపతులకు తేజస్విని, స్రవంతి కుమార్తెలు. వీరు వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు.

చిన్న కూతురు తేజస్విని గృహప్రవేశ కార్యక్రమం ఉండటంతో నెలరోజుల కిందట విగేష్‌, రమాదేవి అమెరికా వెళ్లారు. గృహప్రవేశం తర్వాత అక్కడే ఉన్న దంపతులు.. పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు ఇషాన్‌ పుట్టినరోజు వేడుకలకు శుక్రవారం చిన్న కూతురు, అల్లుడు, పిల్లలతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో వారి కారును ట్రక్కు ఢీకొనడంతో తేజస్విని, రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తల్లీకూతురు మృతితో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -