- Advertisement -
- – ఇద్దరి పరిస్థితి విషమం
- నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): కాటారం-నస్తూరుపల్లి మధ్య కాటారం పల్లె ప్రకృతి వనం సమీపంలలో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వస్తున్న ఏపి 36 ఏటి 8456 నెంబర్ గల తవేరా కార్, కాళేశ్వరం నుండి పుష్కరాలకు వెళ్లి వస్తున్న సూర్యాపేట (నేరేడుచేర్ల)కు చెందిన కియా కార్ లు ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. దీంతో తవేరా వాహనంలో ప్రయాణిస్తున్న భక్తులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ లో భూపాలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వాహనంలో చిక్కు కోగా జేసీబీ సహాయంతో అతన్ని బయటకు తీశారు. అనంతరం పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో వీరిని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా కాటారం పోలీసులు జేసీబీ సహాయంతో రెండు కార్ లను రోడ్డుపై నుండి ప్రక్కకు జరిపించారు. కియా కార్లో ప్రయాణిస్తున్న భక్తులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. కార్ లోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం పోలీసులు తెలిపారు.
- Advertisement -