Wednesday, July 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమణికొండలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

మణికొండలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మణికొండ
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్ర బ్యాంకు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా బి.ఆర్.సి భవన సముదాయంలో నివాసముండే మహిళ శాలిని తన పిల్లలను స్కూటీపై స్కూల్లో వదిలిపెట్టి తిరుగు ప్రయాణం అయింది. పైప్ లైన్ రోడ్ లో వెళ్తుండగా మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్ ను ఓవర్ టెక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో బండికి తగలడంతో రోడ్డుపై కింద పడింది. అదే సమయంలో అటుగా వెళుతున్న వాటర్ ట్యాంకర్ ఆమెను ఢీకొట్టింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -