Thursday, May 22, 2025
Homeక్రైమ్కర్నాటకలో రోడ్డు ప్రమాదం

కర్నాటకలో రోడ్డు ప్రమాదం

- Advertisement -

– ఆరుగురు గద్వాలవాసులు మృతి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లా మనగులి సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు, ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లావాసులు ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టి.భాస్కర్‌, ఆయన భార్య పవిత్ర, కుమారుడు అభిరామ్‌, కుమార్తె జ్యోత్స్న, డ్రైవర్‌ శివప్ప అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్‌ మరో కొడుకు ప్రవీణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. భాస్కర్‌ కెనరా బ్యాంక్‌లో విధులు నిర్వహిస్తూ కుటుంబ సభ్యులతో గద్వాల్‌ బీసీ కాలనీలో నివసిస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -