వ్యక్తి పరిస్థితి విషమం..
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండల పరిధిలోని హౌజుబుజుర్గు జాతీయ రహదారి-163పై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. అర్వపల్లి నుంచి బండ పని పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్తున్న సయ్యద్ యాకుబ్ బైక్ మీద ప్రయాణిస్తూ హౌజుబుజుర్గు గ్రామ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సయ్యద్ యాకూబ్ (32) తీవ్ర గాయాలపాలయ్యాడు. రోడ్డుపై పడి ఉన్న యూకుబ్ ను స్థానికులు 108 కు సమాచారం అందించి దగ్గరలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో యాకూబ్ ను పరిశీలించిన వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న గంట తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



