Sunday, November 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఘోర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆగిఉన్న ఇసుక లారీని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం వల్ల హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -