నవతెలంగాణ – వనపర్తి
కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ సీనియర్ నాయకులు రాగి వేణు ఇటీవల బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు, ఏఐపిసి నేషనల్ హెల్త్ హెడ్ (హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్) డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాగి వేణును ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స తీసుకొని. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి వెంట వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, వనపర్తి మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లా ఏఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, సీనియర్ నాయకులు రాంజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద బాధితుడు రాగి వేణుకు జిల్లెల ఆదిత్యరెడ్డి పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES