Thursday, April 9, 2026
E-PAPER
Homeక్రైమ్రోడ్డు ప్రమాదాలు..నలుగురు మృతి

రోడ్డు ప్రమాదాలు..నలుగురు మృతి

- Advertisement -

వనస్థలిపురంలో కారు బీభత్సం
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
సూర్యాపేటలో మరో ఇద్దరు..
నవతెలంగాణ- వనస్థలిపురం / చివ్వెంల

రోడ్డు ప్రమాదాల్లో వేర్వేరు చోట్ల నలుగురు ప్రాణం కోల్పోయారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించగా ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం హైదరాబాద్‌ వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి హోండాసిటీ కారు డ్రైవర్‌ మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. బీఎన్‌ రెడ్డి నగర్‌ టీచర్స్‌ కాలనీకి చెందిన సభావత్‌ శ్రీధర్‌ రోడ్డు దాటుతుండగా కారు ఢకొీట్టబోయింది. ఆయనను తప్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కారు అదుపు కోల్పోయి రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై ఉన్న కంచర్ల శివ(20), నకిరికంటి సందీప్‌ కుమార్‌(20)ను ఢకొీట్టింది. సుమారు 100 మీటర్ల మేర విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లి పల్టీ కొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. విద్యార్థులు బండ్లగూడలోని మహావీర్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఘటనలో సభావత్‌ శ్రీధర్‌ కూడా తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే తోటి విద్యార్థులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక విచారణలో కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మొక్కులు చెల్లించేందుకు వెళ్తూ ..
ఇంట్లో శుభకార్యం సందర్భంగా దేవుడికి మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురవ్వగా.. ఇద్దరు మృతిచెందారు. పలువురికి గాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా వల్లభాపురం శివారులో జాతీయ రహదారి 65పై మంగళవారం అర్ధరాత్రి జరిగింది. మృతులు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన జనిగ సతీష్‌ (25), జనిగ నరసింహారావు (37)గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -