Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీహార్‌లో రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

బీహార్‌లో రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

- Advertisement -

కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్‌లో ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం పెద్దపీట వేసింది. బుధవారం నాడిక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశం జరిగింది. బీహార్‌లోని బక్సార్‌ – భాగల్పూర్‌ హైస్పీడ్‌ కారిడార్‌ పరిధిలోని మోకామా – ముంగేర్‌ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం 82.4 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4,447.38 కోట్లుగా నిర్ణయించారు. దీంతో పాటు బీహార్‌లోని భాగల్పూర్‌ డంకా రాంపూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని భాగల్పూర్‌-దుమ్కా-రాంపూర్హాట్‌ సింగిల్‌ రైల్వే లైన్‌ సెక్షన్‌ 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్‌ పనులకు రూ.3,169 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad