Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలువర్షానికి పాడైన రోడ్డు..

వర్షానికి పాడైన రోడ్డు..

- Advertisement -

సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టిన గిరిజన నాయకుడు..
నవతెలంగాణ – తిమ్మాజిపేట

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని బిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకుడు వడ్త్యావత్ శంకర్ నాయక్ అన్నారు. తిమ్మాజిపేట మండలంలోని సూర్య నాయక్ తాండ నుంచి హేమ్ల నాయక్ తాండ కు వెళ్లే రహదారి గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్డు అద్వానంగా గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే తండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు వడ్త్యావత్ శంకర్ నాయక్ స్పందించి గురువారం తన సొంత నిధులతో ట్రాక్టర్లతో మొరం వేయించి జెసిపి తో చదను చేయించి మరమ్మతులు చేపట్టారు. దీంతో రెండు తండాల ప్రజలు వర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో సామాజిక కార్యక్రమాలు చేయడంలో ముందుంటానని ఆయన తెలిపారు. ఆయన వెంట మాజీ మాజీ సర్పంచ్ బాలు నాయక్, కిషన్ నాయక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -