- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
మండలంలోని రెంజల్ కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం వద్ద ఇటీవల వరద ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు పనులను మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. గత 15, 20 రోజులుగా వరద ఉధృతికి గురైన రోడ్డు పనుల మరమ్మత్తులను మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కందకుర్తి బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు పనులను వారు మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. వరద కోతకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పనుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. మరమ్మత్తు పనులను పూర్తి చేసి రాకపోకలకు అంతరయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
- Advertisement -