Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలి: సీపీఐ(ఎం)

రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ఆలేరు నుండి గుండ్ల గూడెం మీదుగా పెంబర్తి గేట్ వరకు వెళ్ళే పాత జనగాం హైవే గుంతలమయమై నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రహదారి గుంతలమయమై వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, అట్టి పాత హైవే  రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పటేల్ గూడెం గ్రామ శాఖా ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) పోరు బాట కార్యక్రమంలో భాగంగా ఆలేరు నుండి గుండ్ల గూడెం మీదుగా, శివలాల్ తండా,పటేల్ గూడెం, శ్రీనివాస పురం, పెంబర్తి వరకు వెళ్ళే పాత హైవే రోడ్డును పరిశీలించారు.

అట్టి రోడ్డు పూర్తిగా గుంతలమయమై  ప్రజలు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నాలుగు గ్రామాల ప్రజలు అనునిత్యం ఆలేరుకు ఏ చిన్న అవసరం వచ్చిన ఇదే రోడ్డు నుండి ప్రయాణించాలని, నిత్యం వందలాది మంది హైదరాబాదుకు పనుల నిమిత్తం రాకపోకలు  ఆ రోడ్డు పై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అద్వానమైన రోడ్లను వెంటనే బాగు చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు నల్ల మాస తులసయ్య పిక్క గణేష్,వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, విడిగొండ వాలి,గ్యార భాస్కర్, కొండం సుధాకర్ రెడ్డి, బండ శ్రీనివాసులు, కేతావత్ లాలు, నర్సయ్య, శ్రీహరి, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -