Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్ల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలి

రోడ్ల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలి

- Advertisement -

మెదక్ ఎంపీ రఘునందన్ రావు
నవతెలంగాణ- రాయపోల్ 

రాయపోల్ మండల పరిధిలోని రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం బిజెపి మండల నాయకులు ఎంపీ నివాసంలో కలిసి రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట్, యెల్కల్, బంగ్లా వెంకటాపూర్ వరకు రోడ్డు పూర్తిగా గుంతల మయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, గతంలోనే రఘునందన్ రావు దృష్టికి తీసుకువస్తే ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా రూ.34 లక్షల నిధులు మంజూరయ్యాయి. కానీ తరువాత ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఆ నిధులు రద్దు కావడంతో రోడ్డు పరిస్థితి అలాగే ఉంది. మళ్లీ రోడ్డు సమస్యపై ఎంపీ రఘునందన్ రావుతో చర్చించడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎంపీ పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి బేగంపేట నుంచి బంగ్లా వెంకటాపూర్ వరకు గల రోడ్డు పనులకు సంబంధించి అంచనా విలువను తయారుచేసి పంపించాలని సూచించారు. అలాగే అహ్మద్ నగర్ నుంచి నాచారం వరకు రోడ్డు గురించి రోడ్లు భవనాల అధికారి డీఈఈతో మాట్లాడి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించే విధంగా చూడాలని తెలిపారు. ఈ రోడ్డు గూండా రాయపోల్ మండల కేంద్రానికి అనేక గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. మండల కేంద్రానికి వెళ్లడానికి ఇదే ప్రధానమైన రోడ్డు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మంకిడి స్వామి, మాజీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్,జిల్లా నాయకులు ఎల్కంటి సురేష్, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -