నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణ కేంద్రంలోని రాంనగర్ వద్ద గుంతల మయమైన రోడ్లను మరమ్మత్తులు చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని రామ్ నగర్ వద్ద గుంతలుగా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీపీఐ(ఎం) పోరు బాట కార్యక్రమంలో భాగంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ కేంద్రంలో భువనగిరి- నల్లగొండ రహదారి వెంట అనేక వాహనాలు నడిచే పరిస్థితి ఉందన్నారు.
రోడ్డుకు అడ్డంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో అనేకమంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలతో ఈ గుంతల వలన చాలా ఇబ్బందులు వాహనాదారులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. దాదాపు సంవత్సరం కాలం అవుతున్న ఈ రోడ్లను పట్టించుకునే నాధుడే లేరని వారన్నారు. అధికారులు నిర్లక్ష్యమే ప్రమాదాలకు నిలయంగా రోడ్లు మారుతున్నాయని వారన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గుంతల మయమైన రోడ్లను మరమ్మత్తులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, వనం రాజు, పట్టణ కమిటీ సభ్యులు వల్దాస్ అంజయ్య, పట్టణ నాయకులు మద్దె బోయిన సుందరయ్య, బాబురావు, అక్బర్ పాల్గొన్నారు.
రోడ్ల మరమ్మత్తులను చేపట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES