Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసులమని జాగ్రత్తలు చెప్తూ... దారి దోపిడీ

పోలీసులమని జాగ్రత్తలు చెప్తూ… దారి దోపిడీ

- Advertisement -

– ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణ
నవతెలంగాణ – బాల్కొండ 

ఢిల్లీ పోలీసులమని చెప్తూ పెళ్లికి వెళ్తున్న వారిని ఆపి ఆభరణాలు జాగ్రత్త అని చెప్తూ.. అపహరించిన సంఘటన బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బాల్కొండ ఎస్ఐ కే.శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముప్కాల్ గ్రామానికి చెందిన లింగాపురం గంగారెడ్డి తన చిన్నత్త అయినా ఎర్గట్ల గ్రామానికి చెందిన కొప్పెల లింగవ తో బైక్ పై పెర్కిట్ లో జరుగుతున్న పెళ్లికి వెళ్తున్నారు.

మార్గమధ్యలో బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్కొండ శివారు జాతీయ రహదారి 44 పై రాగానే గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ బండి పై వచ్చి ఢిల్లీ పోలీసులమని చెప్పి వారి వాహనాన్ని ఆపారు. దొంగతనాలు అవుతున్నాయి మెడలో బంగారాన్ని తీసి పర్సులో పెట్టుకోమని వారికి దుండగులు చెప్పారు. వారి మాటలను నమ్మిన మహిళ బంగారాన్ని పర్సులో పెట్టుకోగా దుండగులు వారి దృష్టి మరల్చి 7 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకొని వెళ్లారని తెలిపారు. బాధితురాలు కొప్పెర లింగవ్వ, గంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -