నవతెలంగాణ -బెజ్జంకి
వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని ఎస్ఐ బోయిని సౌజన్య ఆటో డ్రైవర్లకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అవరణం యందు ఎస్ఐ సౌజన్య మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతి వాహనదారుడు సంబంధిత దృవపత్రాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ తెలిపారు. రోడ్డు నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యకు వెనుకాడబోమని ఎస్ఐ హెచ్చరించారు.
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత..
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించడం అందరి బాధ్యతని ఎస్ఐ సౌజన్య తెలిపారు. పోలీస్ స్టేషన్ అవరణం యందు ఎస్ఐ సిబ్బందితో కలిసి పెరుకుపోయిన గడ్డిని తొలగించారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి.. ఆటో డ్రైవర్లకు ఎస్ఐ సౌజన్య సూచన
- Advertisement -
- Advertisement -



