Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని రైతు వేదికలో సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన కొయ్యుర్ ఎస్ఐ-2 రాజన్ కుమార్, మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, ట్రాఫిక్ సంకేతాల ప్రాముఖ్యత, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం అవసరం తదితర అంశాలపై వివరించారు. రహదారి ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో ముఖ్యమని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు,ఇందారపు చెంద్రయ్య,సారయ్య,కామ బాపు,తిర్రి అశోక్,ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -