తెలంగాణలో అమల్లోకి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి రోడ్డు భద్రతా సెస్ అమల్లోకి రానుంది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రవాణా శాఖ ఈ ఆదేశాలను అమలు చేయనుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలు, తెలంగాణలోకి శాశ్వతంగా వలస వచ్చే వాహనాలకు ఈరోడ్డు భద్రతా సెస్‌ను విధిస్తారు. సర్కారు ఆదేశాల ప్రకారం ద్విచక్ర వాహనాలకు రూ.2000, లైట్ మోటార్ వాహనాలకు రూ. 5000, భారీ వాహనాలకు రూ. 10,000 చొప్పున సెస్ కింద రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకుంటారు.
మొత్తం వాహన జీవితకాలంలో ఒకే ఒకసారి ఈ రోడ్డు భద్రతా సెస్‌ను వసూలు చేస్తారు. ఈ సెస్ నుంచి ఆటోలు, ట్రాక్టర్లకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీలో బిల్ సైతం అయింది. గతంలో గెజిట్ కూడా విడుదలైంది. సెస్ ద్వారా వచ్చే నిధులను రోడ్డు భద్రతా ప్రమాణాలను మెరుగు పరచడానికి మాత్రమే వినియోగించనున్నారు. ఈమేరకు తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్టంలో మార్పులు చేశారు. ఈ మేరకు జీవో 10ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ విడుదల చేశారు.
మార్చి ఒకటి నుంచి రోడ్డు భద్రతా సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



