– ఎరైవ్ అలైవ్ ప్రచారం లో సీఐ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనదారుల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం “ఎరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు.
ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఐ అఖిల,పోలీస్ సిబ్బంది, స్థానిక యువకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



