Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు

రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు

- Advertisement -

ప్రాణాలను కాపాడే బాధ్యత
ఇది మన అందరం కలిసి తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత : అరైవ్‌ అలైవ్‌ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి


నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదనీ, అది ప్రాణాలను కాపాడే బాధ్యత అని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. దీన్ని అందరం కలిసి తీసుకోవాల్సిన సాముహిక బాధ్యత అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్‌ ప్లాన్‌’లో భాగంగా అరైవ్‌ – అలైవ్‌ కార్యక్రమంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సీిఎస్‌ వికాస్‌ రాజ్‌, రవాణా శాఖ కమిషనర్‌ ఇలాంబర్తి, రాష్ట్ర డీజీపీ శివదర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సిలు మోహన్‌ నాయక్‌, జయభారతి పలువురు సీఈ లు, రవాణాశాఖ, పోలీసుశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్‌ – అలైవ్‌’ లాంటి మంచి కార్యక్రమం చేపట్టామన్నారు. డీజీపీ శివదర్‌ రెడ్డి రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంచి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. అనారోగ్యం బారిన పడి చనిపోయే వారికంటే యాక్సిడెంట్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2025లో 22,441 రోడ్‌ యాక్సిడెంట్లయితే 6,221 మంది చనిపోయారని తెలిపారు. రోజుకు 18 నుంచి 20మంది ప్రమాదంతలో చనిపోతున్నారని తెలిపారు. ఇందులో 18 నుంచి 40 ఏండ్ల్ల లోపు వారు 60శాతం ఉన్నారని తెలిపారు. హెవీ వెహికల్స్‌ నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని గుర్తు చేశారు. 10 మంది చనిపోయినా స్టేషన్‌ బెయిల్‌ మీద వస్తున్నారని తెలిపారు. ఆ యాక్ట్‌ సవరించాల్సిన ఆవశ్యకత ఉన్నదని వివరించారు. హెల్మెట్‌ ధరించడం, జీబ్రా క్రాసింగ్‌లు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా 70 శాతం ప్రమాదాలను నివారించగలమని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -