Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో రోడ్డు భద్రత చర్యలు

మండలంలో రోడ్డు భద్రత చర్యలు

- Advertisement -

పర్యవేక్షించిన ఎస్ఐ అనిల్ రెడ్డి

నవతెలంగాణకమ్మర్ పల్లి

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గురువారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల రహదారులలో మూల మలుపుల వద్ద పెరిగిన పొదలు (బుషెస్) వాహనదారులకు స్పష్టమైన దృశ్యం అందకుండా అడ్డంకిగా మారుతున్నాయి.ఈ నేపథ్యంలో కమ్మర్ పల్లి ఎస్ఐ జి.అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల రోడ్లలో మూల మలుపుల వద్ద ఉన్న పొదలను జెసిబి లతో తొలగింపజేశారు.

పలు గ్రామాల్లో రోడ్డు భద్రత చర్యలను ఎస్ఐ అనిల్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల మలుపుల వద్ద పొదల్ని తొలగించడం వల్ల వాహనదారులకు ముందున్న మార్గం స్పష్టంగా కనిపించి, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు.ప్రజలు కూడా రోడ్డు భద్రత నియమాలను పాటించి, జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు చురుకుగా పాల్గొని పొదల తొలగింపుకు సహకారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -