- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా ఉప్పునుంతల మండల కేంద్రంలో బుధవారం పోలీసు అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో ఎమ్మార్వో అద్దంకి సునీత పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మైనర్లు బైకులు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. పోలీసు అధికారులు ప్రజలతో కలిసి రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.
- Advertisement -



