నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రత మాసోత్సవ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించినారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నియమ నిబంధనలు తెలియజేసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని, ఆటోలో పెద్దలైతే ముగ్గురు పిల్లలు అయితే ఆరుగురు మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్లు బెల్టు తప్పకుండా ధరించాలని చెప్పారు. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈ విషయాలను విద్యార్థులందరూ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెర్కిట్ పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



