మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్
నవతెలంగాణ – ఆర్మూర్
రహదారి భద్రత జీవితానికి రక్షణ అని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్ అన్నారు. పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థుల చే ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్యం తాగి నడపడం వల్ల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురవుతుందని, పొగ మంచు, దూళి చీకటి గల సొరంగాల గుండా వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లాలని, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న స్థలల వద్ద ఓవర్టేక్ చేయరాదని, రాత్రి వేళల్లో విధిగా డిప్పర్ వాడవలనని సూచించారు. పాదచారులు ఎల్లప్పుడు ఫుట్పాత్ పైనే నడవాలని, ఆకుపచ్చ మనిషి బొమ్మగల సిగ్నల్స్ వెలిగినప్పుడే దాటాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినికి హెల్మెట్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, లిల్లీపుట్ పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ స్వామి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రత.. జీవితానికి రక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



