Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు భద్రత నిబంధనను పాటించాలి 

రోడ్డు భద్రత నిబంధనను పాటించాలి 

- Advertisement -

వారోత్సవాలలో ఎంవిఐ చంద్రశేఖర్ 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

రోడ్డు భద్రత నిబంధనలను వాహనదారులు కచ్చితంగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఈనెల 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా గురువారం ఆర్టిసి డిపోలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు కచ్చితంగా నిబంధనలను పాటించాలన్నారు.

సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. అప్రమత్తతతో వాహనాలు నడిపి సురక్షితంగా ఉండాలన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖంగా సుఖమయంగా ఉంటుందని ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి అలీమ్ డిపో మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, సిఐ భారతి బాయ్, ఎఫ్ఎం యాదగిరి ఎస్ డి ఐ ఎస్ కే ఇక్బాల్ వినయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -