Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలి

రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలి

- Advertisement -

– నిమ్మకు నీరెత్తని ఆర్ అండ్ బి శాఖ
– రోడ్ సైడ్ గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలతో అవస్థలు
నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ ఎక్స్ రోడ్ నుండి జుక్కల్ మండల కేంద్రానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వరుసల రోడ్డు నిర్మించి మార్గం సుగమం చేశారు. ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నాయి. ఈ రోడ్డుపై అక్కడక్కడా గుంతలు పడడంతో పాలకవర్గానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నూతనంగా రోడ్డు వేసేందుకు పాత రోడ్డును తవ్వేసి కొత్త రోడ్డుకు నిధులు మంజూరు చేసి కొత్తగా రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో 2025 వర్షకాలం ప్రారంభ సమయంలో (6 నెలల క్రితం ) కల్లాలి గేట్ నుండి మహమ్మాదాబాద్ గేట్ వరకు ఉన్న జుక్కల్ ఎక్స్ రోడ్డు పునరుద్దరణ పనులను ప్రారంభించారు. కాంక్రీట్ సిమెంట్ మాల్ వేసి రోడ్డును గాలికి వదిలేశారు. దీనివలన రహదారిపై వెళ్ళే వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వాహనాలు వేగంగా వెళ్ళడంతో దుమ్మూ ధూళీ భారీగా పొగమంచు మాదిరిగా రోడ్డు మొత్తాన్ని కమ్ముకుంటోంది. ఈ దుమ్ముకు ఎదరురుగా వచ్చే వాహనాలు కూడా సరిగ్గా కనపడడం లేదు. దీనికి తోడు ఈ దుమ్ము బాటసారుల కళ్ళల్లో పడుతోంది. అంతేకాకుండా రోడ్డు పక్కనే ఉన్న స్కూల్ విద్యార్థులు, వాళ్ళు తినే ప్లేట్లకు కూడా గాలి రూపంలో వచ్చి చేరుతోంది. అంతటితో ఆగకుండా చిన్నారులు, వృద్దులు కూడా ఈ దుమ్ముతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మంది వృద్దులు ఈ దుమ్మువల్ల శ్వాసకోస ఇబ్బందులకు గురై, ఆస్పతిపాలైన దాఖలాలు కూడా లేకపోలేదు. ఇకనైనా ప్రభుత్వాధికారులు, స్థానిక నాయకులు వెంటనే స్పందించి, రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే చుట్టు పక్కల గ్రామాలన ప్రజలందరితో కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -