Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తండాలకు సొంత నిధులతో రోడ్లు, ఎల్ఈడి బల్బులు ఏర్పాటు

తండాలకు సొంత నిధులతో రోడ్లు, ఎల్ఈడి బల్బులు ఏర్పాటు

- Advertisement -

తండాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు మెగావత్ రాము నాయక్
నవతెలంగాణ – తిమ్మాజిపేట

తండా వాసుల రాకపోకలకు ఇబ్బందిగా గుంతల మయంగా మారిన రోడ్లను బాగు చేస్తూ చీకటి మయంగా వున్న తండాలకు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేస్తూ.. తండాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెగావత్ రాము నాయక్ తన సొంత నిధులతో తండాల రూపు రేఖలు మారుస్తున్నారు. మండలంలోని హేమ్లా నాయక్ తండ గ్రామపంచాయతీ లో సూర్య నాయక్ తండా నుండి హేమ్లా నాయక్ తండ వరకు మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా గుంతలుగా ఏర్పడి రాకపోకలు తీవ్ర ఇబ్బందిగా మారింది.

దీన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మెగావత్ రాము నాయక్ రూ.49 వేలు తన సొంత నిధులు వెచ్చించి టిప్పర్లతో మొరం వేయించి జెసిబి పెట్టి చదును చేయించారు. అలాగే హేమ్ల నాయ తండాలో 4వ తారీఖు నుండి తుల్జా భవాని పండుగలు ఉండడంతో పదివేల రూపాయలు ఖర్చుతో తాండా మొత్తం ఎల్ఈడి బల్బులు వేయించారు. దీంతో తండావాసులు వారిని అభినందించారు. మండలంలో వున్నా తండాలకు వెళ్లే రోడ్లు ఇబ్బందికరంగా ఉంటే బాగు చేస్తానని ప్రతి తండాకు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -