– బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు నేటికీ మరమ్మతుకు నోచుకోలేదు
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిన దుబ్బాక నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లను కూడా మరమ్మతు చేపట్టలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప, కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాలలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు .రాయపోల్ మండలంలో రోడ్లు చాలా అద్వానంగా గుంతల మయమై ఉన్నాయని మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు రోడ్లు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని మొరపెట్టుకున్న నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
అహ్మద్ నగర్ నుంచి నాచారం వరకు రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని గుంతల మాయమైందన్నారు. ఈ రోడ్డు గుండా ప్రయాణించిన వాహనదారులు ఎన్నో ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలను సైతం కోల్పోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రలోనే ఉంది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా కానీ సంబంధిత రవాణా శాఖ మంత్రి కానీ ప్రభుత్వం గానీ స్పందించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు నిధులు మంజూరు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసిందన్నారు. నియోజకవర్గంలో మంజూరైన రోడ్ల మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేసి పనులు చేపట్టకపోతే నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబాలు, ప్రజలతోటి పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
అంతకుముందు అహ్మద్ నగర్ నుంచి నాచారం వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని బిజెపి మండల అధ్యక్షులు మంకిడి స్వామి, బిజెపి నాయకులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, రైతుబంధు మాజీ మండల అధ్యక్షులు మున్నా, మాజీ సర్పంచులు ప్రవీణ్, యాదవ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు పర్వేజ్, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, నాయకులు ఇప్ప దయాకర్, కుమార్, పిఎసిఎస్ కార్యదర్శి మల్లేశం, ఏఈఓ స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా రోడ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES