Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జ్యువెలరీ షాప్ ను దోచుకునేందుకు దుండగులు విఫల యత్నం

జ్యువెలరీ షాప్ ను దోచుకునేందుకు దుండగులు విఫల యత్నం

- Advertisement -

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం 
మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు. డిసెంబర్ 27వ తేదీన రెండు ఏటీఎం సెంటర్ లను దోచుకుపోయిన ఘటనలో పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం మళ్లీ స్థానిక ఖలీల్ వాడి ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం డ్యూటీ కి ఎదిరించిన మరో ఘటన వెలుగు చూసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మళ్లీ తాజాగా దోపిడీ యత్నం మరొ ఘటన గురువారం అర్ధరాత్రి అనంతరం వెలుగు చూసింది.

నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీగణేష్ జ్యువెలరీ షాప్ ను దోచుకునేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుప రాడ్లతో షట్టర్ ను ధ్వంసం చేసి పైకి లేపే లోనికి దూరెందుకు ప్రయత్నించారు.

అదే సమయంలో నైట్‌ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే పోలీసు సిబ్బంది సైతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన దుండగులు తప్పించుకున్నట్లు తెలిసింది. విషయం తెలియడంతో ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి, నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -