- Advertisement -
సుమారు రూ.16 వేల నగదు అపహరణ..?
నవతెలంగాణ – బెజ్జంకి
సీసీ కెమెరాల తీగలు తొలగించి..షెట్టర్ ధ్వంసం చేసి దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ ఘటన మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులోని రాజీవ్ రహదారి ప్రక్కన ఉన్న జాన్ డీర్ ట్రాక్టర్ షోరూంలో సోమవారం రాత్రి సమయంలో చోటుచేసుకుంది. దొంగలు షెట్టర్ ధ్వంసం చేసి షో రూంలోకి చొరబడి సుమారు రూ.16 నగదు అపహరించుకుపోయారని.. ఘటనపై పోలీస్ స్టేషన్ యందు పిర్యాదు చేసినట్టు బీఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా ప్రత్యేక బృందాలు దర్యాఫ్తు చేపట్టినట్టు తెలిపారు.
- Advertisement -