నవతెలంగాణ – డిచ్ పల్లి: అంతర్ జిల్ల దొంగల ముఠా నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుండి సోత్తును స్వాదీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్ వివరించారు. మంగళవారం ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ హెచ్ ఓ జి సందీప్ తో కలిసి వివరాలను వెల్లడించారు. ఒకే కుటుంబం కి చెందిన 9 మంది A1) దాసరి మురళి క్రిష్ణ, A2: దాసరి నర్సయ్య,A3:గణేష్, A4:రాజేష్,A5:రావుల శివ, A6:సమ్మక్క, A7:భవాని, A8:రేణుక, A9:నాగయ్య అందరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులబంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అందరు కలిసి ముఠాగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో గత ఐదు నెలల నుండి వరుస దొంగతనాలు చేస్తూ, తప్పించుకుని తిరుగుతున్న9 మంది గల దొంగల ముఠాలో గల ఇద్దరు సబ్యులను (A4:రాజేష్, A5:రావుల శివ) లను గత నెలలో పట్టుకొని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారని చెప్పారు. డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్ పర్యవేక్షణలో రెండు స్పెషల్ టీమ్స్ లను ఏర్పాటు చేసి, దొంగల అచూకీ కోసం వేట కొనసాగించగా మంగళవారం ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి.సందీప్ పోలీస్ సిబ్బందితో కలిసి, చాక చక్యంగా వ్యవహరించి దొంగల ముఠాలోని ముఖ్య సభ్యుడు దాసరి మురళీకృష్ణను పట్టుకున్నారు. దొంగలించిన సొత్తును వనస్థలిపురం, హైదరాబాద్ కు చెందిన చిన్నారం జాట్ కు అమ్మాడని తెలుసుకొని అతని వద్ద నుంచి 7 తులాల బంగారు అబరణాలు స్వాధీనం చేసుకున్నాట్లు వివరించారు. దాసరి మురళి కృష్ణ ఇదివరకే నేర చరిత్రను కలిగి పలు మార్లు దొంగతనాలు చేసి పలు కేసుల్లో జైల్ కి వెళ్ళడం జరిగిందని తెలిపారు.
నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు:-
1) బంగారం నక్లెస్=40 గ్రాములు,
2) బంగారు జత చెవి కమ్మలు=5 గ్రాములు,
3) బంగారు జత చెవి బుట్ట కమ్మలు=5 గ్రాములు
4) 4 బేబీ బంగారం రింగులు =4 గ్రాములు ,
5) నలుగు చిన్న బంగారు ఉంగరాలు-4 గ్రాములు,
6) ఒక బంగారు చైన్=8 గ్రాములు,
7) బంగారు చాకటి గుండ్లు =2 గ్రాములు ,
8) వివో మొబైల్ ఫోన్ A1:మురళి.
9)1500/- రూపాయల నగదు,
10)రెండు రోల్డ్ గోల్డ్ నెక్లెస్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దొంగల ముఠా నాయకుడి అరెస్ట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES