భూగర్భం నుంచి స్పేస్ వరకు ఏం జరుగుతుందో మానవ మేధస్సు తెలుసుకుంటూనే ఉన్నది. అన్వేషిస్తూనే ముందుకు సాగుతున్నది. ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకున్న తీరు, ఆమెను తీసుకొచ్చే క్రమ మంతా కండ్లకు కట్టినట్టు చూపించింది. కష్టమైన మానవ శ్రమను తగ్గించుకునేందుకు నిరంతరం మానవుని మెదడు పని పరిశోధనలు చేస్తూనే ఉంది. అందులో రోబోలు చాలావరకు ఈ శ్రమను తగ్గిస్తున్నాయి.కొన్నిచోట్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతీస్తున్నాయి. అయినా మానవులు చేయకూడని, చేయలేని పనుల్లోకి రోబోలు తమ ప్రాణా లకు తెగించి పోరాడుతున్నాయి. ఇటీవల శ్రీశైలం టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో అధికారులకు సహకరించేందుకు రోబోలను వాడారు. కొంతమంది హోటల్స్‌లో సర్వర్లుగా, ట్రాఫిక్ కంట్రోలర్స్‌గా, ఐటీ ఉద్యోగాల్లో రోబోలను పెట్టి పనులు చేయిస్తు న్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు కీలకమైన శరీర అవయ వాల్లోకి వెళ్లి కూడా రోబోలు చికిత్స చేయడం ఆశ్చర్యం! వ్యవసాయ పనుల్లోనూ వాటిపాత్ర పెరిగింది. మనుషులకు బదులుగా మసాజ్ సెంటర్లలో రోబోలను వాడుతున్నటు, ఇవిబాగా మసాజ్ చేస్తున్నట్టు వినియోగదారుల టాక్. రోబో సినిమాలో చిట్టిరోబో హిరోయిన్ ప్రేమలో పడతాడు. ఇది ప్రకృతికి విరుద్ధమైన చర్యని ఆ తర్వాత దాన్ని ధ్వంసం చేస్తారు. దీన్నిబట్టి రోబోల పని విధానం నెక్ట్స్ లెవల్ ఎలా ఉండబోతుందో అర్థమయ్యే ఉంటుంది!
– గుడిగ రఘు