Monday, April 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెనే హాస్పిటల్‌లో రోబోటిక్‌ మోకాలు కీలుమార్పిడి చికిత్స ప్రారంభం

రెనే హాస్పిటల్‌లో రోబోటిక్‌ మోకాలు కీలుమార్పిడి చికిత్స ప్రారంభం

- Advertisement -

– ఉత్తర తెలంగాణలోనే తొలిసారిగా అత్యాధునిక వైద్యం: కేటీఆర్‌
నవతెలంగాణ-కరీంనగర్‌

ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా రోబోటిక్‌ మోకాలు కీలుమార్పిడి చికిత్సను కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని రెనే హాస్పిటల్‌లో ఆదివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. వాలిస్‌ కంపెనీకి చెందిన సుమారు రూ.5 కోట్ల విలువైన అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ యంత్రాన్ని ప్రారంభించి, అనంతరం లక్కీ డ్రా ద్వారా 15 మందిని ఉచిత కీలు మార్పిడి చికిత్సకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బంగారి స్వామి, డాక్టర్‌ రజనీ ప్రియదర్శినిలను అభినందించారు. డాక్టర్‌ బంగారి స్వామి మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కీర్తిశేషులు బంగారి లక్ష్మి, మైసయ్య జ్ఞాపకార్థం ఏటా సుమారు రూ. 50 లక్షల విలువైన సర్జరీలను ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఈ లక్కీ డ్రాకు సుమారు 180 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఎంపికైన 15 మందికి నెల రోజుల్లోపు ఉచితంగా ఆపరేషన్‌ చేస్తామని, మిగతా వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పొన్నం అనిల్‌ గౌడ్‌, ఏనుగు రవీందర్‌ రెడ్డి, రఘువీర్‌ సింగ్‌, మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌, నేతి రవి వర్మ, కార్పొరేటర్లు సరిల్ల రాజకుమారి ప్రసాద్‌, సోమిడి వేణు, బండారి వేణు, కాంగ్రెస్‌ నాయకులు అబ్దుల్‌ రెహమాన్‌, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -