న్యూయార్క్: అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు దిగ్గజ ఆటగాడు, స్విట్జర్లాండ్ తరఫున అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన రోజర్ ఫెదరర్ ఎంపికయ్యాడు. రోజర్ ఫెదరర్ తన తొలి టెన్నిస్ అరంగేట్రం మ్యాచ్‌తోనూ ఇందుకు ఎంపికయ్యాడని రోడ్ ఐలాండ్‌కు చెందిన హాల్ బుధవారం ప్రకటించింది. టెన్నిస్ జగత్తులో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించిన తొలి ఆటగానికి ఫెదరర్ రికార్డుపుటల్లోకెక్కాడని, ఈ క్రమంలో యువ క్రికెటర్లు నొవాక్ జకోవిచ్(సెర్బియా), రఫెల్ నాదల్(స్పెయిన్)లతో ధీటుగా పోరాడి గ్రాండ్‌స్లామ్ సాధించాడని పేర్కొంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు 8 సాధించిన తొలి ఆటగాడు కూడా ఫెదరర్ మాత్రమే. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్(6), యుఎస్ ఓపెన్(5), ఫ్రెంచ్ ఓపెన్(1) కైవసం చేసుకున్నాడు. తాజా ఓటింగ్‌లో ఫెదరర్‌కు ఎన్ని ఓటర్లు వచ్చాయో మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.



