Friday, July 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్త్వరలోనే 'రోహిత్ వేముల చట్టం' : డిప్యూటీ సీఎం భట్టి

త్వరలోనే ‘రోహిత్ వేముల చట్టం’ : డిప్యూటీ సీఎం భట్టి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 2017లో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేస్తూ.. ఆ ఘటన వెనుక ఉన్న అసలు బాధ్యులను దేశ ప్రజలముందు నిలబడే చర్యనే అతి పెద్ద ప్రశ్నగా ఆయన అభివర్ణించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2017 లో రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని షేక్ చేసింది. సూసైడ్ లేఖలో రోహిత్ వేముల రాసిన అంశాలను పరిశీలిస్తే, ఎన్నో విషయాలు తెలుస్తాయి.

HCUలో అడ్మిషన్ తో పాటూ తాడు, విషం ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశాడు. రోహిత్ వేముల రాసిన రాతలు దేశాన్ని కలిచి వేశాయి. రోహిత్ వేముల హైదరాబాద్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటాలను అడ్డుకుని.. ఏబీవీపీ సుషీల్ కుమార్ వీసీకి పిర్యాదు చేశారు. అయితే తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోకపోగా.. ఇప్పుడు అదే వ్యక్తికి డిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు ఇచ్చారు. ఇది దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనించాలని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులపై రామచందర్ రావు ఒత్తిడి తెచ్చారని.. HCU వీసీపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తిని బీజేపీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడమంటే, దళితులను ఇబ్బంది పెట్టిన వారికి బహుమతి ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. అలాగే రోహిత్ వేముల కేసు పునర్విచారణకు కోర్టును ఆశ్రయించామని, త్వరలోనే తెలంగాణలో ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని సంకల్పించినట్లు అయన వ్యాఖ్యానించారు. ఇది వర్గవివక్షకు వ్యతిరేకంగా న్యాయబద్ధమైన ఆయుధం అవుతుందని భట్టి స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించింది. దళితులు, గిరిజనులు సగౌరవంగా జీవించాలన్నదే మా ఆకాంక్ష. అలాంటి వర్గాలను భయపెట్టి, ఒత్తిడితో అణగదీసే విధానాలను తిప్పికొడతాం అని భట్టి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -