Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంగవర్నర్‌ పాత్ర - రాజ్యాంగ పరిమితులు

గవర్నర్‌ పాత్ర – రాజ్యాంగ పరిమితులు

- Advertisement -

కేరళ పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ : ఎల్డీఎఫ్‌ సర్కార్‌ నిర్ణయం
తిరువనంతపురం :
గవర్నర్‌ పాత్ర, అధికారాలు , రాజ్యాంగ పరిమితుల గురించి ఉన్నత మాధ్యమిక తరగతుల సిలబస్‌లో చేర్చనున్నట్టు కేరళ విద్యాశాఖ ప్రకటించింది. ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్‌ అధికారిక పాత్ర..నిర్దేశించిన రాజ్యాంగ పరిమితులు సహా దేశ సమాఖ్య రాజకీయాల గురించి తెలియజేసే ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల గురించి విద్యార్థులు తెలుసుకోవడం సామాజికంగా అత్యవసరమని విద్యామంత్రి వి.శివన్‌కుట్టి శుక్రవారం మీడియాకి తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, మంత్రి మండలి , అసెంబ్లీ, ప్రజల పట్ల వారి సమిష్టి బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సివుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో భారతమాతగా పేర్కొంటూ ప్రదర్శించే సింహంపై కాషాయ జెండాతో ఉన్న మహిళ చిత్రానిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాధ్‌ అర్లేకర్‌ ప్రదర్శించడాన్ని నిరసిస్తూ కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్‌కుట్టి వాకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నిధులతో నడిచే యూనివర్సిటీల నిర్వహణలో ఛాన్సలర్‌గా జోక్యం చేసుకోవడం, అసెంబ్లీ తీర్మానించిన బిల్లుల ఆమోదానికి నిరాకరించడం , రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్‌ చేయడం ద్వారా కీలక బిల్లులను ఆలస్యం చేయడం, రాష్ట్ర కార్యక్రమాల్లో రాజకీయ పార్టీల చిహ్నాలను ప్రదర్శించడాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సందేశాలకు కేంద్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌ను వేదికలా మార్చిందని మండిపడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad