Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ పునర్నిర్మాణానికి నడుం బిగించండి

ఇరాన్‌ పునర్నిర్మాణానికి నడుం బిగించండి

- Advertisement -

తమపై అకారణంగా అమెరికా- ఇజ్రాయిల్‌ దాడులు
ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ

అమెరికా- ఇజ్రాయిల్‌ తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మండిపడ్డారు. ఈ దాడుల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరిం చడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం విడుదల చేశారు. అమెరికా- ఇజ్రాయిల్‌ తమ దేశంపై కొనసాగిస్తోన్న నీచమైన, దురాక్రమణ దాడులను మొజ్తాబా ఖండించారు. ఇరాన్‌ అభివద్ధిని విస్తరించడం, ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌లోని మినాబ్‌ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -