ఏఓ ఛాంబర్ నుంచి డి-సెక్షన్ వరకు ఓ భాగం నేలమట్టం
ధ్వంసమైన ట్రెజరీ కార్యాలయం
పరుగులు తీసిన కాపలా పోలీసులు
మట్టిలో కలిసిపోయిన ఫైళ్లు
తప్పిన పెను ప్రమాదం…
భయాందోళనలో సిబ్బంది
సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగిన ప్రమాదం
నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టరేట్
నిధుల్లేక ఆగిన పనులు
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనం పైకప్పు కూలింది. సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోని పైకప్పు విరిగి వరండాపై పడింది. ఏఓ ఛాంబర్ నుంచి డి-సెక్షన్ వరకు ఓ భాగం మొత్తం కూలింది. కింద ట్రెజరీ కార్యాలయానికి సంబంధించిన విభాగం దెబ్బతింది. ట్రెజరీ కార్యాలయం ముందు పహారా కాస్తున్న ఇద్దరు పోలీసులు ఒక్క సారిగా పైకప్పు కూలడంతో బయటకు పరుగులు తీశారు. భద్రపరిచిన ఫైళ్లు దెబ్బతిన్నాయి. ఏఓ ఛాంబర్ నుంచి డి-సెక్షన్ వరకు వరండా పూర్తిగా కూలడంతో ఆ గదులకు వెళ్లనేని పరిస్థితి నెలకొంది. అందులో విలువైన కంప్యూటర్లు ఫైళ్లు ఉన్నాయి. వాటిని బయటకు తీయడానికి వీల్లేకుండా భవనం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న అధికారులు కలెక్టరేట్‌కు వచ్చి భవనాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
తప్పిన ప్రాణ నష్టం
జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉండటంతో కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు తహసీల్దార్ స్థాయి అధికారులు ఆయన వెంట ఉండటంతో ప్రమాదం తప్పిందని పలువురు పేర్కొన్నారు. సుమారు సాయంత్రం 7గంటల సమయంలో కూలడంతో ఉద్యోగులు అప్పటికే వెళ్లిపోయారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం పూట జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగుండేదని అధికారులు చెబుతున్నారు. జనం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయా విభాగాల్లో తహసీల్దార్ స్థాయి అధికారులతో పాటు సిబ్బంది సుమారు 40 మంది వరకు పనిచేస్తుంటారు. ఏదేమైనా ప్రాణ సష్టం జరగలేదని, కానీ విధులు నిర్వర్తించాలంటేనే భయమేస్తోందని ఉద్యోగులు, సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదిలా ఉంబగా కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరిగిన ఏండ్లు అవుతున్నా ఇప్పటివరకు పూర్తి కాలేదు. నిధుల్లేక మధ్యలోనే పనులు ఆగిపోయాయి
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో కూలిన పైకప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES