Friday, December 5, 2025
E-PAPER
Homeఆటలురూట్‌ సెంచరీ

రూట్‌ సెంచరీ

- Advertisement -

స్టార్క్‌కు ఆరు వికెట్లు
ఇంగ్లండ్‌ 325/9

బ్రిస్బేన్‌: యాషెస్‌ సిరీస్‌ (పింక్‌ బాల్‌-డే/నైట్‌) రెండో టెస్ట్‌లోనూ ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సంచలన బౌలింగ్‌తో మెరిసాడు. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఆధిప్యతం చెలయించగా.. మూడో సెషన్‌లో స్టార్క్‌ మెరుపు బౌలింగ్‌ చెలరేగాడు. చివర్లో జో రూట్‌ సెంచరీకి తోడు జోఫ్రా ఆర్చర్‌ ఇంగ్లండ్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 9వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. రూట్‌(135) సెంచరీకి తోడు ఆర్చర్‌(32) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ చివరి వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్‌ క్రాలే(76) మాత్రమే అర్ధసెంచరీతో రాణించగా.. బ్రూక్‌(31), కెప్టెన్‌(19), జాక్స్‌(19) ఫర్వాలేదనిపించారు. డకెట్‌, పోప్‌, స్మిత్‌ డకౌట్లయ్యారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు తొలి రోజే షాక్‌ తగిలింది. పెర్త్‌లో పది వికెట్లు తీసి.. బెన్‌ స్టోక్స్‌ బృందాన్ని కుప్పకూల్చిన మిచెల్‌ స్టార్క్‌(6/76) మరోసారి పర్యాటక జట్టును దెబ్బ కొట్టాడు. స్టార్క్‌ విజృంభణతో 5 పరుగులకే 2 వికెట్లు పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్‌(135 నాటౌట్‌ 202 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో)తో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే(76)తో కలిసి స్కోర్‌బోర్డును నడిపించిన రూట్‌.. 181 బంతుల్లో కంగారూ గడ్డపై మొదటి శతకం సాధించాడు. ఈ ఫార్మాట్‌లో రూట్‌కిది 40వ సెంచరీ కావడం విశేషం.

264 పరుగులకే 9 వికెట్లు
క్రాలే, రూట్‌ ద్వయాన్ని నెసెర్‌ విడదీసి ఇంగ్లండ్‌ను కష్టాల్లో పడేశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్‌(31)ను పెవిలియన్‌ పంపిన స్టార్క్‌.. డేంజరస్‌ జేమీ స్మిత్‌(0), విల్‌ జాక్స్‌(19), గస్‌ అట్కిన్సన్‌(4), బ్రైడన్‌ కార్సే(0)లను ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ అంచున నిలిపాడు. 264 పరుగులకే 9 వికెట్లు పడినా రూట్‌ మాత్రం పట్టువదల్లేదు. చివరి బ్యాటర్‌ జోఫ్రా ఆర్చర్‌(32 నాటౌట్‌) సహకారంతో జట్టు స్కోర్‌ 300 దాటించాడు. వికెట్‌ కాపాడుకుంటూ చక్కని షాట్లు ఆడిన ఆర్చర్‌, రూట్‌ హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో.. తొలిరోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల చేసింది.

వాసిం అక్రం రికార్డు బ్రేక్‌
ఆస్ట్రేలియా పేసర్‌ మిఛెల్‌ స్టార్క్‌ ఒక రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభమైన పింక్‌బాల్‌ టెస్ట్‌లో ఆసీస్‌ ఎడమచేతి వాటం పేసర్‌ మిఛెల్‌ స్టార్‌ పాకిస్తాన్‌ పేసర్‌ వాసీం అక్రం పేరిట ఉన్న ఒక రికార్డును బ్రేక్‌ చేశాడు. గబ్బా వేదికగా ఇంగ్లండ్‌పై తొలిరోజు ఆరు వికెట్లు తీసిన స్టార్క్‌.. టెస్టుల్లో సాధించిన వికెట్ల సంఖ్యను 418కు పెంచుకున్నాడు. స్టార్క్‌ కేవలం 102మ్యాచుల్లో 26.43సగటుతో ఇన్ని వికెట్లను పడగొట్టాడు. దీంతో ఎడమచేతి వాటం పేసర్లలో 418వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వాసిం అక్రమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. వాసీం అక్రం 104 టెస్టుల్లో 414 వికెట్లు తీసి ఇంతకుముందు ఈ రికార్డును తన పేర లిఖించాడు.

స్కోర్‌బోర్డు…
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి)క్యారీ (బి)నెసెర్‌ 76, డకెట్‌ (సి)లబూషేన్‌ (బి)స్టార్క్‌ 0, పోప్‌ (బి)స్టార్క్‌ 0, రూట్‌ (బ్యాటింగ్‌) 135, బ్రూక్‌ (సి)స్మిత్‌ (బి)స్టార్క్‌ 31, స్టోక్స్‌ (రనౌట్‌)ఇంగ్లిస్‌ 19, స్మిత్‌ (బి)బోలండ్‌ 0, విల్‌ జాక్స్‌ (సి)స్మిత్‌ (బి)స్టార్క్‌ 19, అట్కిన్సన్‌ (సి)క్యారీ (బి)స్టార్క్‌ 4, కర్సే (సి)క్యారీ (బి)స్టార్క్‌ 0, ఆర్చర్‌ (బ్యాటింగ్‌) 32, అదనం 9. (74ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 325పరుగులు.
వికెట్ల పతనం: 1/5, 2/5, 3/122, 4/176, 5/210, 6/211, 7/251, 8/264, 9/264.
బౌలింగ్‌: స్టార్క్‌ 19-0-71-6, నెసెర్‌ 14-3-43-1, బోలండ్‌ 19-1-87-1, డోగెట్‌ 14-1-76-0, గ్రీన్‌ 8-1-43-0.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -