విద్యార్థులకు రూ.3.30 లక్షల స్కాలర్‌షిప్ పంపిణీ
నవతెలంగాణ- సిటీబ్యూరో
మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం రోటరాక్ట్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. క్లబ్‌ను రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.ఎస్‌వి.రాంప్రసాద్ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి హరిహర ప్రసాద్, రోటరీ క్లబ్ నార్త్ హైదరాబాద్ అధ్యక్షులు డా. కె.వెంకట మురళి, కార్యదర్శి సుమన్ పోషాల హాజరయ్యారు. వారికి అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షులు డా.జి.రామేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి రాంచందర్, కోశాధికారి మురళీధర్, సీనియర్ సభ్యులు జెఆర్‌ఎస్.కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌బాబు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షులు స్వాగత ప్రసంగం చేసి రోటరాక్ట్ క్లబ్ లక్ష్యాలు, సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు అందించే అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31 మంది విద్యార్థులకు ఇబీసీ స్కాలర్‌షిప్‌లు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.3,10,000 అందజేశారు. వికలాంగ విద్యార్థికి రూ.20,000 స్కాలర్‌షిప్ అందజేశారు. మొత్తంగా మూడు లక్షల 30 వేల రూపాయల స్కాలర్‌షిప్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు.
మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



