నవతెలంగాణ – కంఠేశ్వర్ : స్థానిక హోటల్ వంశీ లో 2025- 26 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ జేమ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డిజిపి రొటేరియన్ అనురాగ శర్మ పాల్గొని క్లబ్ నూతన అధ్యక్షుడిగా రొటేరియన్ పాకాల నరసింహారావుని అలాగే వారితో పాటు కార్యదర్శిగా రోటేరియన్ గంజి రమేష్ కోశాధికారిగా రొటేరియన్ పాల్తి రజిత్ కుమార్, బోర్డు మెంబర్స్ ని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రోటరీ మాజీ గవర్నర్ రొటేరియన్ హనుమంత్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ రొటీరియన్ జైపాల్ రెడ్డి, అలాగే రోటరీ క్లబ్ నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ రోటరీ క్లబ్ కామారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రొటేరియన్ పాకాల నరసింహారావు మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మొహానాబాద్ వారి సహకారంతో ఆ క్లబ్ ట్రస్ట్ అయిన తెలంగాణ మాజీ డిజిపి రొటేరియన్ అనురాగ్ శర్మ రోటరీ క్లబ్ జేమ్స్ వారితో కలసి నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో రూపాయలు 30 లక్షలు విలువ చేసే రెండు టాయిలెట్ బ్లాక్స్ నిర్మించి ఇస్తామని తెలియజేయడం జరిగింది.అలాగే రోటరీ క్లబ్ జేమ్స్ కాబోయే అధ్యక్షుడు రొటీరియన్ పడాల సత్తయ్య తెలియజేస్తూ అనురాగ శర్మ తెలంగాణమొదటి డిజిపిగా బాధ్యతలు నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకొని రూపాయలు 51000 మన భారత సైన్యానికి విరాళం ప్రకటించారని తెలియజేశారు.
రోటరీ క్లబ్ ఆప్ జేమ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES