నవతెలంగాణ – కంఠేశ్వర్ : రక్షాబంధన్ పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర బాలసదన్ లో ఘనంగా రక్షాబంధన్ సంబరాలు శనివారం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్గర్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా కార్య నిర్వహణ అధికారి బరాడు మహేందర్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ భారతీయుల సంప్రదాయ వేడుక చెల్లె, అక్క, తమ్ముడు, అన్న, ఎల్లవేళలా రక్షగా అండదండలుగా ఉండమే కాకుండా హృదయానికి హత్తుకునే అభిమానం అన్నారు. సోదర, సోదరి భావన కలిగిన వారికి రాఖీలను కట్టి రక్షాబంధన్ జరుపుకోవచ్చని తెలిపారు.
ఈ నేపధ్యంలో భారతదేశానికి అన్ని కాలాలలో సేవ చేస్తున్న సైనికులకు కూడా రాఖీలను కట్టి ఘనంగా రక్షాబంధన్ చేసుకోవచ్చన్నారు. బాలసదన్ లోని బాలికలకు స్టీల్ వాటర్ బాటిల్ లని అందజేసి రాఖీలను కట్టించుకుని బిస్కెట్లను, చాక్లెట్లను పంపిణి చేశారు. స్టీల్ వాటర్ బాటిల్ల దాత, క్లబ్ సభ్యులు ధీరజ్ రెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కార్యదర్శి గోవింద్ జవహర్, కోశాధికారి జుగల్ జాజు, జగదీశ్వర్ రావు, రాజ్ కుమార్ సుబేదార్, ధన్పాల్ శ్రీనివాస్, పార్సి రాజేశ్వర్, పవన్ పాండే, శ్రీకాంత్ జవహర్, బాబురావు, జుగల్ సోనీ, సతీష్ షా, మోటోరి మురళి, గంగారెడ్డి, బాలసదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.